: సీపీఎం-వైఎస్సార్సీపీ మధ్య పొత్తు కుదిరింది
సీపీఎం- వైఎస్సార్సీపీల మధ్య పొత్తు కుదిరింది. ఖమ్మం-మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య స్థానికంగా అవగాహన కుదిరింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 2 స్థానాల్లో సీపీఎం, 5 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీచేయనున్నాయి. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో మూడు స్థానాల్లో సీపీఎం, నాలుగు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీపీఎం నేత సుదర్శన్ తెలిపారు.