: మోడీకి నకిలీ మోడీల భరోసా
బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ర్యాలీల ద్వారా, సామాజిక వెబ్ సైట్ల ద్వారా, మాస్కులతో, త్రీడీ ప్రచారంతో ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో మోడీకి స్వాంతననిచ్చేందుకు నకిలీ మోడీలు రంగంలోకి దిగారు. ముగ్గురు నకిలీ మోడీలు రంగంలోకి దిగి మోడీ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ అతనికి మద్దతు తెలుపుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ కి చెందిన పీటీ టీచర్ అభినందన్ పాఠక్ నరేంద్ర మోడీ కవల సోదరుడిలా ఉంటారు.
అతను యూపీలో మోడీ తరపున ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. మహారాష్ట్ర మలాడ్ లోని వికాస్ మహంతే అచ్చుగుద్దిన మోడీలా ఉంటారు. ఆయన శివసేన, బీజేపీ కూటమి తరపున ప్రచారం చేస్తున్నారు. మూడో వ్యక్తి జితేంద్ర వ్యాస్ ఇతను మోడీ పోటీ చేస్తున్న వడోదర వాసి. దీంతో మోడీని దేశ వ్యాప్తంగా ప్రచారం చేసుకొమ్మని, ఆయన మోడీ తరపున ప్రచారం చేస్తున్నారు.