: తలపై వెంట్రుకలనే కాపాడుకోలేనోడు మమ్మల్నేం రక్షిస్తాడు: అజంఖాన్


ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, ఎస్పీ నేతలు అమిత్ షా, అజంఖాన్ ల మధ్య విమర్శలు వ్యక్తిగత దూషణల స్థాయికి చేరాయి. మత ఘర్షణలకు ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపీకి ఓటేయాలంటూ ఇటీవల షా ఇచ్చిన పిలుపుపై అజంఖాన్ తీవ్రంగా స్పందించారు. దేవుడి అనుమతి లేకుంటే తమకు(ముస్లింలకు) ఏమీ కాదని అజంఖాన్ అన్నారు. తలపై వెంట్రుకలు కాపాడుకోలేనోడు(షా) తమను ఎలా రక్షిస్తాడు? అంటూ ప్రశ్నించారు. షా మాత్రమే కాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఖాన్ కూడా ప్రసిద్ధుడే. కార్గిల్ యుద్ధంలో భారత ఆర్మీ విజయం సాధించడానికి ముస్లిం సైనికులే కారణమని ఆయన కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News