: అలవాట్లో పొరపాటున ఆయన ‘కాంగ్రెస్ కి జై’ అనేశారు!
ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణ పొరపాటు పడ్డారు. ఆయన ఇవాళ టీడీపీ కార్యాలయానికి వచ్చి ‘కాంగ్రెస్ కి జై’ అని... ఆనక తూచ్ అనేశారు. చేసిన పొరపాటు గ్రహించి చిరునవ్వుతో టీడీపీకి జిందాబాద్ కొట్టేశారు. పితాని సత్యనారాయణ ఇటీవలే ‘సైకిలెక్కి’ పచ్చ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.