: వారణాసిలో పోటీ నుంచి తప్పుకున్న ముక్తార్ అన్సారీ
వారణాసి లోక్ సభ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ముక్తార్ అన్సారీ పోటీ నుంచి తప్పుకొంటున్నానని ఇవాళ (గురువారం) ప్రకటించారు. ఓట్లను చీల్చడం ఇష్టం లేకే పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు అన్సారీ చెప్పారు. వారణాసి ఎంపీ స్థానానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీ పడుతోన్న సంగతి తెలిసిందే. 2009 సార్వత్రిక ఎన్నికల్లో మురళీ మనోహర్ జోషి పై పోటీ చేసి అన్సారీ ఓటమి పాలయ్యారు.