: జగన్ ను సీఎం చేయడమే ధ్యేయం: సీకే బాబు
మహాప్రస్థానం ముగింపు రోజునే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని చిత్తూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు అన్నారు. చిత్తూరులో సీకేబాబు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయమని అన్నారు. జగన్ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించుకున్నారని ఆయన చెప్పారు.
సీకే బాబుగా సుపరిచితులైన సీకే జయచంద్రారెడ్డి తొలుత చిత్తూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 1994, 1999, 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు.