: ప్రయాణికుడి నుంచి 99 లక్షలు స్వాధీనం
సికింద్రాబాద్ లోని బొల్లారంలో ఓ ప్రయాణికుడి నుంచి పోలీసులు 99 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాదులోని బొల్లారంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సిద్ధిపేట వెళ్తున్న ఓ ప్రయాణికుడి నుంచి 99 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.