: ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: జైరాం రమేశ్


కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ఈ రోజు ఆదిలాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ తోనే తెలంగాణ పునర్ నిర్మాణం సాధ్యమన్నారు. అధికారంలోకి వస్తే ప్రాణహిత చేవెళ్ల, పాలమూర్ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ పోర్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబించిందని విమర్శించారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి నామినేషన్లు వేసిన రెబల్స్ పై చర్యలు తీసుకుంటామన్నారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, తెలంగాణలో బీసీలకు 32 సీట్లు కేటాయించామనీ అన్నారు.

  • Loading...

More Telugu News