: చూపిస్తాం.. మీరు రెడీనా?: మంత్రి పొన్నాలకు టీఆర్ఎస్ సవాల్


తెలంగాణ వ్యాప్తంగా ఎండిన పంటలు చూపించేందుకు తాము సిద్దమని, దానికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేస్తారా..? అని మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు టీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారు. పొన్నాల ప్రాతినిధ్యం వహిస్తోన్న జనగాం నియోజకర్గంలోని జనగాం, రఘునాథపల్లి, ఖిలాషాపర్ లో ఎండిన పంటలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది.
 
ఈ సందర్భంగా పొన్నాలను ఉద్దేశిస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా ఎండిన పంటలను చూపించేందుకు తాము సిద్దంగా ఉన్నామని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ తెలిపారు. విద్యుత్ సమస్య మీద వచ్చేనెల 9న వామపక్షాలు చేపట్టే బంద్ కు మద్దతిచ్చే విషయాన్ని పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయిస్తామని ఆయన స్పష్టం చేశారు.  

  • Loading...

More Telugu News