: అధికారంలోకి వస్తే బుందేల్ ఖండ్ రాష్ట్రం ఇస్తాం: ఉమా భారతి
బీజేపీ లోక్ సభ అభ్యర్థి ఉమా భారతి ఓటర్లకు హామీల మీద హామీలు ఇచ్చేస్తున్నారు. అయోధ్య వివాదాన్ని కోర్టు బయటే సామరస్యంగా పరిష్కరిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన ఆమె... తాజాగా బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక బుందేల్ ఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదీ మూడేళ్లలో రాష్ట్రం ఏర్పాటవుతుందని చెప్పారు. ఈ మేరకే తన నియోజకవర్గం ఝాన్సీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భారతి మాట్లాడారు.