: ఆటో డ్రైవర్ పై ట్రాఫిక్ పోలీసుల దాడి


హైదరాబాదులో ఇవాళ ఓ ఆటోడ్రైవర్ ను ట్రాఫిక్ పోలీసులు చితకబాదారు. సరూర్ నగర్ చెరువు కట్ట సమీపంలో పట్టపగలు అందరూ చూస్తుండగానే ట్రాఫిక్ పోలీసులు కిందపడేసి మరీ కొట్టారు. బూటు కాళ్లతో విచక్షణా రహితంగా తన్నారు.

సరూర్ నగర్ చెరువుకట్ట వద్దనున్న ఓ మసీదు వద్ద ఓ ఆటోవాలా తన ఆటోను నిలిపాడు. ఇంతలో అక్కడకు వచ్చిన ట్రాఫిక్ పోలీసులు...అక్కడెందుకు ఆటోను నిలిపావంటూ ఆటోడ్రైవర్ను నిలదీశారు. అంతటితో ఆగకుండా అతడిని పట్టుకుని దారుణంగా కొట్టారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ట్రాఫిక్ పోలీసులకు కనీసం నేమ్ బ్యాడ్జీలు కూడా లేకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News