: రాజకీయం నేర్చిన నగ్మా


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అంత సీను లేదని ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలో నిలిచిన సినీ నటి నగ్మా అన్నారు. మీరట్ లో ఆమె మాట్లాడుతూ, మోడీకి అంత ఆదరణ ఉంటే వారణాసి లాంటి సురక్షిత స్థానం నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేసి ఉండేవారని అభిప్రాయపడింది. తనకు కాంగ్రెస్ అధిష్ఠానం సీటు కేటాయించిందని, ఏ స్థానం నుంచి అభ్యర్థులు గెలుస్తారో అదే స్థానాల్లో పార్టీ అధిష్ఠానం అభ్యర్థులను బరిలో నిలుపుతుందని ఆమె స్పష్టం చేశారు. తన గెలుపు నల్లేరు మీద నడకేనని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News