: ‘చిట్టీ’ల రాణి చిట్టా లాగుతున్న సీసీఎస్ పోలీసులు
‘చిట్టీల’ రాణిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలుచేసి టీవీ ఆర్టిస్ట్ విజయరాణి బెంగళూరుకు పారిపోయిన సంగతి తెలిసిందే. అక్కడామెను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ అధికారులు, ఎంత డబ్బు వసూలు చేసింది? ఆమెకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి? ఆస్తులను ఎవరెవరికి విక్రయించింది? తదితర విషయాలను ఆరా తీస్తున్నారు. పలువురు జూనియర్ ఆర్టిస్టుల నుంచి చిట్టీల పేరుతో ఆమె భారీగా డబ్బులు దండుకున్నారు. విచారణ అనంతరం ఒకటి, రెండు రోజుల్లో ఆమెను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విజయరాణి బంధువుల్లో ఈ కేసుతో సంబంధం ఉన్న మరింత మందిని అరెస్ట్ చేయనున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు.