: అత్యాచారం యత్నం.. నిందితుడిని రంపంతో ముక్కలుగా కోసిన భర్త


నెయ్యి అమ్ముకునేందుకు వచ్చి, ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య మీద అత్యాచారానికి పాల్పడ్డ  ఓ వ్యక్తిని భర్త అత్యంత క్రూరంగా మట్టుబెట్టాడు. నిజామాబాద్ గ్రామీణ మండలం నర్సింగ్ పల్లిలో ఉదయం ఈ ఘటన జరిగింది. అత్యాచారానికి యత్నించడంతో మహిళ పెద్దగా కేకలు వేసింది. దీంతో భర్త వచ్చి నిందితుడి తలపై రాడ్డుతో కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం రంపంతో మృత దేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

  • Loading...

More Telugu News