: అనుష్కతో కోహ్లీ జైపూర్ లో చెట్టపట్టాల్
అలా టీ20 ప్రపంచకప్ టూర్ ముగించుకుని భారత్ లో అడుగుపెట్టాడో లేదో... విరాట్ కోహ్లీ తన ప్రియురాలిని వెతుక్కుంటూ జైపూర్ చెక్కేశాడు. అనుష్కశర్మ 'ఎన్ హెచ్10' సినిమా షూటింగ్ కోసం మంగళవారం సాయంత్రం జైపూర్ కు వచ్చింది. అక్కడి నుంచి ఖేజ్రాలకు వెళ్లింది. దీంతో ప్రియురాలిని కలసి చాలా రోజులు కావడంతో కోహ్లీ నేరుగా జైపూర్ విమానాశ్రయంలో బుధవారం ఉదయం వాలిపోయాడు. హోటల్లో రీఫ్రెష్ అయ్యాక అతడు కూడా ఖేజర్లకు చేరుకోగా, ఇద్దరూ కలసి కోట పరిసరాల్లో విహరించారట.