: దిగ్విజయ్ ను కలసిన ఏపీ యూత్ కాంగ్రెస్ నేతలు
ఆంధ్రప్రదేశ్ లోని యూత్ కాంగ్రెస్ నేతలు ఈ రోజు ఢిల్లీ వెళ్లి దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేతలకు అవకాశమివ్వాలని కోరారు. కొద్ది రోజుల్లో సీమాంధ్రలోనూ నామినేషన్ల పర్వం మొదలుకానుంది. ఈ క్రమంలో పార్టీ నుంచి అభ్యర్థులను ప్రకటించనున్నారు. దాంతో తాము కూడా టికెట్లు ఆశిస్తున్న విషయాన్ని డిగ్గీ ముందుంచారు.