: పలు చోట్ల మావోయిస్టుల విధ్వంసం
ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు పలుచోట్ల విధ్వంస చర్యలకు దిగారు. బీహార్ లోని ముంగేర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున ఒక కల్వర్టు కింద మందుపాతర అమర్చి పేల్చారు. ఈ దాడిలో ఎన్నికల భద్రత కోసం వెళుతున్న సీఆర్పీఎఫ్ జవాన్లు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మెషిన్లను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. అదే సమయంలో ఒక ట్రక్కుకు నిప్పు పెట్టారు. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలపునిచ్చిన విషయం తెలిసిందే.