: 30వ తేదీలోగా ఆస్తిపన్ను కడితే ఐదు శాతం రాయితీ


హైదరాబాదు మహా నగర పాలక సంస్థ పరిధిలో నివసించే ప్రజలకు జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ నెల 30వ తేదీలోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను కడితే 5 శాతం రాయితీ ఇస్తామని కార్పొరేషన్ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించని వారికి మాత్రం ఈ పథకం వర్తించదని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. ఈ పథకం రూ. 250 కోట్లు పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ పరిధిలో ఎన్నడూ లేని విధంగా వెయ్యి కోట్ల మేర ఆస్తిపన్ను వసూలు చేసినట్లు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News