: ఓఎంసీ కేసు చివరి చార్జిషీటులో సబిత పేరు
సంవత్సరాల నుంచి సాగుతున్న ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ నేడు తుది ఛార్జిషీటును గగన్ విహార్ సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. ఎ8గా రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎ9గా విశ్రాంత ఐఏఎస్ కృపానందం పేర్లను ఇందులో పేర్కొంది. ఈ కేసులో సబితా, కృపానందంల పాత్ర ఉందని తెలిపింది. ఐపీసీ 125, 120బి, 409 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(2) కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది. అయితే, అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం మినహా ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ తెలిపింది.