: సచివాలయంలో ఎలక్షన్ మీడియా సెంటర్ ప్రారంభం
రాష్ట్ర సచివాలయంలో ఎలక్షన్ మీడియా సెంటర్ ను ఈరోజు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భన్వర్ లాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రలో లోక్ సభ, శాసనసభ స్థానాలకు ఈ నెల 12వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 90 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు భన్వర్ లాల్ చెప్పారు.