: జయప్రదపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు
సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రదపై ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ పోలీసు స్టేషన్ లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ఇటీవల రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ (ఆర్ ఎల్డీ) లో చేరిన జయ యూపీలోని బిజ్నోర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. జిల్లా అధికారుల అనుమతి లేకుండా నియోజకవర్గంలో జయ ఎన్నికల ప్రచార సభను నిర్వహించారని, దాంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.