: కేజ్రీవాల్...! నన్ను క్షమించండి: ఆటోడ్రైవర్ లాలి
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తనపై దాడి చేసిన ఆటోడ్రైవర్ ఇంటికి వెళ్లి కలిశారు. తనపై దాడి చేసేందుకు కారణాలను తెలుసుకునేందుకు ఆయన లాలితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్ లాలి 'తాను చాలా పెద్ద తప్పు చేశానని, తనను క్షమించాల'ని కోరాడు. లాలి 'ఆప్ మద్దతు దారుడని, కేజ్రీవాల్ పై ఎందుకు దాడి చేశాడో తెలియడం లేదని' అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా 'తనపై దాడి చేసిన వారిని శిక్షించవద్దని, భౌతిక దాడులకు దిగితే వారికి మనకు తేడా ఏంట'ని ఆయన ప్రశ్నించారు. అనంతరం దక్షిణపురి ప్రచారంలో దాడి చేసిన అబ్దుల్ వాహిద్ ను కలిసి మాట్లాడారు. తనపై దాడులు జరగడానికి కారణం రాజకీయ ప్రత్యర్థులేనని ఆయన స్పష్టం చేశారు.