: పుట్టపర్తిలో మాజీ సీఎం కిరణ్ రోడ్ షో
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలో కిరణ్ మాట్లాడుతూ... తెలుగు వారందరూ కలిసి ఉండాలని ఆకాంక్షించారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీని వీడి పార్టీ పెట్టానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సమైక్యంగానే ఉండాలని కిరణ్ పునరుద్ఘాటించారు.