: ఐదేళ్ల దాకా కోహ్లీ పెళ్లి గురించి ఆలోచించం: తల్లి సరోజ్ కోహ్లీ


భారత క్రికెట్ జట్టులో సత్తా, సామర్ధ్యం ఉన్న యువ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ ఎంత పాప్యులర్ అయ్యాడో అమ్మాయిలను ఆకర్షించడంలోనూ అంతే ముందున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ఇతగాడు డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా 'కోహ్లీ మ్యారీ మీ' అంటూ బ్రిటన్ క్రికెట్ మహిళా జట్టులోని డేనియల్ వ్యాట్ అనే క్రీడాకారిణి బహిరంగంగా ప్రపోజ్ చేసింది. ఈ సంచలనంతో ఇప్పుడందరూ కోహ్లీ పెళ్లి గురించే ముచ్చటించుకుంటున్నారు. దానిపైనే అతగాడి తల్లి సరోజ్ కోహ్లీని సంప్రదించగా, 'విరాట్ వివాహం గురించి మరో నాలుగైదేళ్ల వరకు మేం ఆలోచించం. ఇప్పుడిప్పుడే అతడు క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ప్రస్తుతం తన బ్యాటింగ్, కెరీర్ పైనే దృష్టి పెట్టాల్సి ఉంది' అని తెలిపారు.

  • Loading...

More Telugu News