: కేసీఆర్ కుటుంబం నుంచి నలుగురు బరిలోకి!
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుటుంబ నుంచి ఒకరు, ఇద్దరు కాదు... ఏకంగా నలుగురు బరిలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్ లో వీరికి ఐదు టికెట్లు దక్కాయి. గత ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయగా, ఆయన మేనల్లుడు హరీశ్ రావు మెదక్ జిల్లా సిద్ధిపేట నుంచి, తనయుడు కేటీఆర్ సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఈసారి కేసీఆర్ మెదక్ లోక్ సభ, ఆ జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుండగా, హరీశ్ రావు (సిద్ధిపేట), కేటీఆర్ (సిరిసిల్ల) తమ సిట్టింగ్ స్థానాల నుంచి మళ్లీ బరిలోకి దిగుతున్నారు. ఇక, ఇప్పుడు కొత్తగా తన కూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు కేసీఆర్ తాజాగా ప్రకటించారు.