: శైలజానాథ్ అడుగులు ఇప్పుడు ఏ పార్టీ వైపు?


తన ఆరోగ్యం సహకరించనందునే రాజకీయాలకు దూరంగా ఉన్నానని మాజీ మంత్రి శైలజానాథ్ తెలిపారు. ఈరోజు ఉదయం ఆయన వెంకన్న దర్శనార్థం తిరుమల కొండకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. ఒకటి, రెండు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని ఆయన తెలిపారు. ఆయన ఇటీవలే అమెరికాలోని కాలిఫోర్నియాలో చెస్ట్ ట్యూమర్ కు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం విదితమే.

శైలజానాథ్ ఏ పార్టీ వైపు వెళతారోనన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ గా శైలజానాథ్ పనిచేశారు. పార్టీ అధిష్ఠానం ఎదుట సమైక్య నినాదాన్ని వినిపించారు. ఆ తర్వాత మాజీ సీఎం కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్ష పదవిని శైలజానాథ్ కు అప్పగించారు. అయితే, ఆ పార్టీకి అనుకున్నంతగా ఆదరణ లేకపోవడంతో ఆయన జేఎస్పీకి దూరంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News