: లోకకల్యాణం కోసం మాకు మద్దతివ్వండి: మోడీ


లోకకల్యాణం కోసం తమకు మద్దతివ్వాలని వడోదరలో ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కోరారు. తమకు మద్దతిస్తే సుపరిపాలన అందిస్తామని తెలిపారు. కాగా, తన పట్ల వడోదర ప్రజలు చూపిన ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలని ఆయన చెప్పారు. ఇక్కడి ప్రజలు తనకు మద్దతిస్తారన్న నమ్మకం ఉందన్న మోడీ, వడోదర తనను కార్యోన్ముఖుడిని చేసిన గడ్డ అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News