: మెదక్ లో కేసీఆర్ నామినేషన్.. జనగామలో పొన్నాల


మెదక్ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. మద్దతుదారులతో కలసి సంగారెడ్డిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయశాంతి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే, ఆమె ఇప్పుడు మెదక్ శాసనసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగామ అసెంబ్లీ స్థానానికి ఈ రోజు నామినేషన్ సమర్పించారు. 2009లోనూ ఆయనిదే స్థానం నుంచి గెలుపొందారు.

  • Loading...

More Telugu News