: భద్రాద్రిలో సీతారామచంద్రస్వామి పట్టాభిషేకం
ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి పట్టాభిషేకం జరుగుతోంది. సీతారాముల కల్యాణం జరిగిన తదుపరి రోజే అంటే దశమి సందర్భంగా రాముడి పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయతీ. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తర్వాత స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగించి శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం మిథిల మండపంలో భద్రాద్రి సీతారామచంద్ర స్వామికి విష్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించారు. ఈ సమయంలో పట్టాభిషేక విశేషాలను వేద పండితులు, అర్చకులు వివరిస్తున్నారు.