: కేసీఆర్ మాటమీద నిలబడడు... అధికారం మాదే: జానారెడ్డి
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు విశ్వసనీయత లేదని, మాటమీద నిలబడడని మాజీ మంత్రి జానారెడ్డి విరుచుకుపడ్డారు. గజ్వేల్ లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని తనంతట తానుగా చేసిన ప్రతిపాదనను గాలికొదిలేసిన కేసీఆర్ కు ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.