: గుంటూరులో మోడల్ పోలింగ్ బూత్ ఏర్పాటు


ఓటు వేసే విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించి, వారు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేసేందుకు మోడల్ పోలింగ్ బూత్ ను గుంటూరు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ ప్రారంభించారు. గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తున్న ఈ పోలింగ్ బూత్ లో ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలు అందుబాటులో ఉంటాయని, వీటి ద్వారా ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో వేయాలో కూడా ఓటర్లు తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది నిజమైన పోలింగ్ కేంద్రాల్లో ఎలా ఉంటారో... ఇక్కడ కూడా అలాగే ఉండి హెల్ప్ డెస్క్ గా కూడా సేవలందిస్తారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News