: రేణుకా చౌదరి, బలరాం నాయక్ వర్గీయుల ఘర్షణ


రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, కేంద్ర మంత్రి బలరాం నాయక్ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య నివాసానికి రేణుకా చౌదరి వెళ్లిన సందర్భంగా అక్కడే బలరాం నాయక్ ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతవ్వడానికి కారణం బలరాం నాయక్ అంటూ రేణుకా చౌదరి వర్గీయులు ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగారు. వారికి దీటుగా బలరాం నాయక్ వర్గీయులు కూడా స్పందించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News