: ఎలక్షన్ డ్యూటీ చేయాలనుందా? అయితే, ఈ అవకాశం మీ కోసమే!


2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనుంది. ఇందులో యువకులను భాగస్వాములను చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రస్తుతం ఎంసీఏ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి పోలింగ్ రోజున వెబ్ కాస్టింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసే అవకాశం కల్పించనున్నట్లు హైదరాబాదు కలెక్టర్ సోమేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న యువకులు గ్రేటర్ హైదరాబాదు వైబ్ సైట్ www.ghmc.gov.in లో తమ పేరును నమోదు చేసుకోవాల్సిందిగా సోమేష్ కుమార్ కోరారు. ఎంపికైన వారికి రూ. 500 గౌరవ వేతనంతో పాటు భోజన, ప్రయాణ ఛార్జీలను చెల్లిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News