: లావు అంటూ వంక పెట్టి... జైలుపాలైన వరుడు


పెళ్లికి ముందే అదనపు కట్నం కోసం వధువును వేధించిన కేసులో వరుడుతో పాటు అతని కుటుంబ సభ్యులను మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ సెంట్రల్ ఏసీపీ లావణ్యలక్ష్మి దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. విజయవాడలోని మాచవరానికి చెందిన యువతికి హైదరాబాదులోని కూకట్ పల్లి వాసి పాలెం విక్రమ్ నాయుడుతో గత ఫిబ్రవరి 6న వివాహం నిశ్చయమైంది.

వివాహ నిశ్చితార్థం సమయంలో వరుడికి రూ. 2 లక్షల నగదును కట్నంగా ఇచ్చారు. వచ్చేనెల 12న పెళ్లి కావాల్సి ఉంది. ఈ క్రమంలో పెళ్లికొడుకు, అతని కుటుంబ సభ్యులు కలసి పెళ్లికూతురుకు ఫోన్ చేసి ‘‘నువ్వు లావుగా ఉన్నావ్... ఈ పెళ్లి జరుగదు. మరో ఐదు లక్షలు ఇస్తేనే పెళ్లి జరుగుతుంది’’ అని వేధింపులకు గురిచేశారు. దీంతో, బాధితులు మాచవరం పోలీసులను ఆశ్రయించిన విషయం విదితమే. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వరుడు విక్రమ్ నాయుడుతో పాటు అతని తల్లి, సోదరి, పినతల్లిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News