: కాంగ్రెస్, బీజేపీ కూటముల ఓటమికి కృషి చేస్తాం: తమ్మినేని
కాంగ్రెస్, బీజేపీ కూటముల ఓటమికి కృషి చేస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీపీఎం తెలంగాణ అభివృద్ధి ప్రణాళికను ఈ నెల 16న ప్రకటిస్తామని అన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు దాదాపు లేనట్టేనని ఆయన స్పష్టం చేశారు. నోముల పార్టీ నుంచి బయటకు వెళ్లడం బాధాకరమని ఆయన అన్నారు.