: వైఎస్సార్సీపీలో చేరిన వనమా
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత వనమా నాగేశ్వరరావు పార్టీ వీడారు. కాంగ్రెస్ పార్టీ తనకు అసెంబ్లీ టికెట్ కేటాయిస్తుందన్న ఆశతో ఉన్న వనమా, టికెట్ కేటాయించకపోవడంతో అలకబూనారు. తక్షణం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు.