: టీ-పీసీసీ చీఫ్ పొన్నాల టిక్కెట్లు అమ్ముకున్నారు: శంకరరావు
మాజీ మంత్రి శంకరరావు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై మండిపడ్డారు. పొన్నాల టిక్కెట్లను అమ్ముకున్నారంటూ ఆయన ఆరోపించారు. టి-కాంగ్రెస్ జాబితాలో శంకరరావుకు టిక్కెట్ రాకపోవడంపై స్పందించిన ఆయన ఈరోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. కేవీపీ కనుసన్నల్లో టి-కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆయన ఆరోపించారు.
టి-కాంగ్రెస్ టిక్కెట్ల కేటాయింపులపై సీబీఐచే విచారణ జరిపించాలని శంకరరావు డిమాండ్ చేశారు. తాను కాంగ్రెస్ విధేయుడినని, ఏ పార్టీలో చేరేది లేదని ఆయన తేల్చి చెప్పారు. కంటోన్మెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.