: హైదరాబాదులో ఘనంగా ప్రారంభమైన శ్రీరాముని శోభాయాత్ర
హైదరాబాదు పాతబస్తీలోని ధూల్ పేట నుంచి శ్రీరాముని శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ శోభాయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ యాత్ర పురానాపూల్ చౌరస్తా, జుమ్మెరాత్ బజార్, చుడీ బజార్, ఛత్రీ, బేగంబజార్, సిద్ధిఅంబర్ బజార్, గౌలిగూడ, కోఠి, సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ టేక్డీలోని హనుమాన్ వ్యాయామశాలకు సాయంత్రం 6 గంటలకు చేరుకోనుంది.
ఈ శోభాయాత్ర సందర్భంగా హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సీపీ అనురాగ్ శర్మ తెలిపారు. శోభాయాత్ర కొనసాగే మార్గంలో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా దారి మళ్లింపు చేపట్టారు. ఈ ఆంక్షలు సాయంత్రం యాత్ర ముగిసేవరకు అమల్లో ఉంటాయని అనురాగ్ శర్మ చెప్పారు.