: కాంగ్రెస్ పార్టీ ఓ పుచ్చకాయలాంటిది: మోడీ
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కేరళలోని కాంగ్రెస్ సర్కారు పాలనపై విరుచుకుపడ్డారు. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన కేరళ, దురదృష్టవశాత్తూ ఉగ్రవాద సంరక్షణ కేంద్రంగా మారిపోయిందన్నారు. కాసరగఢ్ లో ఈ రోజు జరిగిన సభలో మోడీ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని పుచ్చకాయతో పోల్చారు. పుచ్చకాయకు పైన పొట్టు ఆకుపచ్చగా ఉంటుందని, కానీ, లోపల ఎర్రగా ఉంటుందని కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. కేరళలో మహిళలకు ఎంత మాత్రం భద్రత లేదని చెప్పారు. మహిళలకు రక్షణ లేని మొదటి పది రాష్ట్రాల్లో కేరళ కూడా ఉందని వివరించారు. ఈ పది రాష్ట్రాల్లోనూ ఆరు కాంగ్రెస్ పాలించేవేనన్నారు. కేరళ యువత వేరే రాష్ట్రాల్లో ఉపాధి వెతుక్కోవాల్సిన దుస్థితి ఉందన్నారు. తీర ప్రాంతమైన కేరళ దేశానికి కావాల్సిన ఉప్పును అందించడంతోపాటు, విదేశాలకు సైతం ఎగుమతి చేసే అవకాశం ఉందని సూచించారు.