: జేఏసీకి టికెట్ల వ్యవహారం అధిష్ఠానం పరిశీలనలో ఉంది: పొన్నాల


తెలంగాణలో తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్ అందులో జేఏసీ నేతలెవ్వరి పేరు పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, జేఏసీ నేతల టికెట్ల వ్యవహారం అధిష్ఠానం పరిశీలనలో ఉందన్నారు. కాగా, గెలుపు, సామాజిక న్యాయం ప్రాతిపదికగానే సీట్ల కేటాయింపు జరిగిందని చెప్పారు. కుమారుడికి లోక్ సభ సీటు ఇస్తే తానే తప్పుకుంటానని సబిత చెప్పారని, శంకరరావు వ్యవహారాన్ని అధిష్ఠానం చూసుకుంటుందని పొన్నాల వివరించారు. కాగా, ఒకట్రెండు చోట్ల సమస్య తలెత్తినా సీపీఐతో సర్దుబాటు చేసుకుంటామన్నారు.

  • Loading...

More Telugu News