: ప్రత్యర్థుల ఎత్తుకు పైఎత్తులు వేసి... పంతం నెగ్గించుకున్న పొన్నం


కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అనుకున్నది సాధించారు. తన వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇప్పించుకుని పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రకటించిన జాబితాలో ఉన్న ఓయూ జేఏసీ నేతలు గజ్జెల కాంతం, దరువు ఎల్లన్న పేర్లను పట్టుబట్టి తప్పించి సత్తాచాటారు. వీరి రాక తనకు ఇబ్బందికర పరిస్థితులను, అసమ్మతిని రాజేస్తుందని గ్రహించిన పొన్నం అహ్మద్ పటేల్ తో మాట్లాడి సిరిసిల్ల దేవయ్య, కొండూరి రవీందర్ రావుకు కేటాయించేలా చేశారని సమాచారం.

మాజీ మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ఎవరికి వారుగా లాబీయింగ్ చేసి తమ వర్గానికి చెందినవారికి టికెట్లు ఇప్పించుకునేందుకు పావులు కదిపారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే దేవయ్యకు టికెట్ ఇప్పించుకుని తనదే పైచేయి అని చాటారు. వేములవాడ, హుజూరాబాద్ లో కూడా పొన్నం తన వర్గానికి చెందిన వారికి టిక్కెట్లిప్పించుకుని పంతం నెగ్గించుకున్నారని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

  • Loading...

More Telugu News