: నా పాస్ పోర్టు కాపీ ఇవ్వలేను: సోనియా


అమెరికా కోర్టు ఆదేశాల మేరకు తన పాస్ పోర్టు ప్రతులను సమర్పించలేనని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం ఇందుకు తనను అనుమతించలేదంటూ సోనియా తన లాయర్ ద్వారా న్యూయార్క్ కోర్టుకు తెలియజేశారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనే కేసును సోనియా ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సోనియాకు న్యూయార్క్ లోని బ్రూక్లిన్ కోర్టు గతంలో సమన్లు జారీ చేయగా... సోనియా అమెరికా పర్యటన సందర్భంగా వాటిని ఆమెకు అందజేసినట్లు అక్కడి అధికారులు అంటున్నారు. అయితే, అవి తనకు అందలేదని సోనియా గత విచారణ సందర్భంగా చెప్పడంతో, పాస్ పోర్టు జిరాక్స్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పాస్ పోర్టులో ప్రతీ విదేశీ పర్యటన వివరాలు ఉంటాయి.

  • Loading...

More Telugu News