: శ్రీవారిని దర్శించుకున్న నటి జూహీచావ్లా, స్నేహ
శ్రీరామనవమి సందర్భంగా తిరుమలకు సినీ నటుల తాకిడి పెరిగింది. ఈ ఉదయం శ్రీవారిని బాలీవుడ్ నటి జూహీచావ్లా దర్శించుకున్నారు. అటు మరో నటి స్నేహ తన భర్త ప్రసన్న, కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న వీరికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా జూహీ మాట్లాడుతూ, దేవుడు చాలా శక్తిమంతుడని, అన్నీ ఆయనకు తెలుసని అన్నారు. బాలాజీ దర్శనం చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా వెంకటేశ్వరుని దర్శించుకుని పొర్లు దండాలు పెట్టారు. రేపు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో స్వామివారి ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు.