: బీజేపీ నేత అమిత్ షాకు ఈసీ నోటీసు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుక్కుంటున్న పలువురిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్ ఇన్ ఛార్జ్ అమిత్ షాకు ఈసీ నోటీసు పంపింది. దాంతో, ఆయన మరింత సమస్యల్లో చిక్కుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యూపీలోని ముజఫర్ నగర్ లో ప్రసంగించిన షా.. 'ఇటీవల జరిగిన మత ఘర్షణల్లో మిమ్మల్ని అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలంటే బీజేపీకి ఓటు వేయండి' అంటూ రెచ్చగొట్టారు. దాంతో, ఈ వ్యాఖ్యలను పరిశీలించిన ఈసీ చర్యలకు ఉపక్రమించి వివరణ ఇవ్వాలని నోటీసులో తెలిపింది. ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.