: పోలీసుల అదుపులో బీజేపీ కార్యకర్తలు
రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీతో పొత్తు వద్దని, ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యకర్తలు నేటి ఉదయం నుంచి ఆందోళనకు దిగారు. పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవడంతో బీజేపీ కార్యాలయంపైకి ఎక్కి తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కి తరలించారు.