: వచ్చీ రావడంతోనే ప్రతీ బాల్ ను బాదడం కుదరదు: ధోనీ


టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోవడానికి కారణమయ్యాడంటూ యువరాజ్ సింగ్ పై విమర్శలు వెల్లువెత్తుతుంటే... జట్టు కెప్టెన్ ధోనీ మాత్రం అతడిని వెనకేసుకొచ్చాడు. నిన్నటి మ్యాచులో యువరాజ్ 21 బాల్స్ తిని కేవలం 11 పరుగులే చేయడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసిన విషయం తెలిసిందే. అయితే, యువరాజ్ తన శక్తిమేర ఆడాడని, అతడికి ఈ రోజు కలసి రాలేదంటూ మ్యాచ్ అనంతరం ధోనీ శాంత వచనాలు వినిపించాడు. వచ్చీ రావడంతోనే ప్రతీ బాల్ ను బాదేయడం అంత తేలిక కాదన్నాడు. అభిమానులకంటే ఆటగాడే ఎక్కువ నిరాశకు లోనవుతాడని అన్నాడు.

  • Loading...

More Telugu News