: జగన్ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నాడు: జేసీ
చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్న జగన్ మాటలు వింటే నిండా మునగడం ఖాయమని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అనంతపురం మాజీ డిప్యూటీ మున్సిపల్ ఛైర్మన్ సాకే వెంకటరాముడు టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీ వారసులే ఖాళీగా ఉంటే, వైఎస్ పేరు చెప్పి జగన్ ఓట్లడగడం సిగ్గుచేటని అన్నారు.
లక్ష కోట్లు సంపాదించిన జగన్ ఈసారి అధికారంలోకి వస్తే మరో రెండు లక్షల కోట్లు సంపాదిస్తారని జేసీ విమర్శించారు. జగన్ కు ప్రజా సంక్షేమం పట్టదని, తన సంక్షేమం, బంధువుల సంక్షేమం మాత్రమే చూసుకుంటాడని ఆయన మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి ఓటేయొద్దని జేసీ పిలుపునిచ్చారు.