: కిరణ్ కూడా కాంగ్రెస్ వాదే: సాయిప్రతాప్
కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని ఎంపీ సాయిప్రతాప్ తెలిపారు. దిగ్విజయ్ సింగ్ ఢిల్లీకి రావాలంటూ తనను పిలిచారని... చిరంజీవి, బొత్స, రఘువీరారెడ్డిలు తనను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారని చెప్పారు. దిగ్విజయ్ తో భేటీ అయిన సందర్భంలో... విభజన సందర్భంగా సీమాంధ్ర ప్రజల హృదయాలు గాయపడ్డాయని చెప్పినట్టు తెలిపారు. జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కూడా కాంగ్రెస్ వాదే అని సాయిప్రతాప్ స్పష్టం చేశారు. కిరణ్ విషయంలో పునరాలోచించాలని పార్టీ పెద్దలను కోరానని తెలిపారు. సాయిప్రతాప్ మళ్లీ సొంత గూటికి చేరిన నేపథ్యంలో, అయనకు మళ్లీ రాజంపేట లోక్ సభ స్థానాన్నే కేటాయించనున్నట్టు సమాచారం.