: రాహుల్ నాకు కాదు సవాల్... అమేథీ ప్రజలకు: స్మృతి


ఉత్తరప్రదేశ్ లోని అమేథీ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీతో ఢీకొడుతున్న బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఈరోజు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమేథీ చేరుకున్న స్మృతిని విలేకరులు పలకరించగా... రాహుల్ ను తనకు సవాల్ గా భావించడం లేదన్నారు. అమేథీ ప్రజలకు అసలైన సవాల్ గా రాహుల్ మారారని ఆమె ఎద్దేవా చేశారు. టీవీ నటి నుంచి బీజేపీ నేతగా అవతరించిన స్మృతిని రాహుల్ కు ప్రత్యర్థిగా పార్టీ పోటీలోకి దింపింది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కుమార్ విశ్వాస్ కూడా రాహుల్ ను ఓడిస్తానంటూ రంగంలో దిగిపోయారు. వెరసి అమేథీలో రాహుల్, స్మృతి, విశ్వాస్ ముగ్గురి మధ్య పోటీ నువ్వా? నేనా? అన్నట్లు నడవనుంది.

  • Loading...

More Telugu News