: రవాణా సమ్మె లేదోచ్


డీజిల్ ధరల పెంపు, మూడవపక్షం బీమా పెంపును నిరసిస్తూ భారత రవాణా సంఘం తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. ఈ సమ్మెను వాస్తవానికి ఏప్రిల్ 1న జరపాలని భావించారు. దేశవ్యాప్తంగా లక్షలాది లారీలు, ట్రక్కులు, బస్సులను తిప్పరాదని తలంచారు. ఈ మేరకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే, రవాణా సంఘాల ప్రతినిధులు.. కేంద్రంతోపాటు ఐఆర్డీఏ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ) సంఘాలతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి.

బీమా ప్రీమియంను 107 శాతం నుంచి 20 శాతానికి తగ్గించేందుకు ఐఆర్డీఏ అంగీకరించింది. దీంతో సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు రవాణా సంఘం తెలిపింది. కాగా, వచ్చేనెల మొదటి వారంలో ఐఆర్డీఏ.. పెట్రోలు ట్యాంకర్లు, లారీ యజమానుల సంఘాలతో చర్చలు జరపనుంది. 

  • Loading...

More Telugu News